యోగాతో బాగా పరిగెత్తగలగటము


"కష్టే ఫలీ !"  కష్టము తోనే మంచి ఫలితము ఉంటుంది.
ఏడు సార్లు ప్రపంచములో "మిస్టర్ ఒలింపియా" (శారీరిక ధారుడ్యము కలిగిన వ్యక్తిగా) ఎన్నికైన అర్నాల్డ్ స్వాజేనేగ్గేర్ (Arnold Schwarzenegger)  ఒకానొక సందర్భములో చెప్పిన ఈ మాట, నేటి తరము లో దైనందిన  జీవితములో అందరూ ఏ పనికైనా అన్వయించుకోదగిన పద్ధతిగా మారినది.
కాని అంతకష్టము నిజముగా అవసరమా?
కష్టమును తగ్గించి, ఫలితమును పెంచే ప్రణాళిక ఏదైనా ఉంటే ఎంతబాగుంటుందో కదా! అవునా?
కాని ఆశ్చర్యకరముగ అలాంటిది ఏది లేదు.
సరియైన శరీర ఆకృతి కావాలంటే మొదటిగా అందరికీ గుర్తుకు వచ్చే ప్రక్రియ పరిగెత్తటము మాత్రమె.
సాధారణముగ శరీరము యొక్క బరువు తగ్గించుకోవటానికి ఎటువంటి ఖర్చు లేకుండ అందరూ చేసేటటువంటి పని ఈ పరిగెత్తటము.
దీనివలన శరీరము యొక్క శక్తి పెరుగుతుంది కాని ఎలాంటి నష్టము ఉండదు.
కాని కొంచెం జాగ్రత్త అవసరము.
దీని వలన తుంటి, తొడ, మోకాలు, కాలు, చీలమండ మరియు పాదముల యందు గాయములు అయ్యే అవకాశము ఉన్నది. 
పరిగెత్తే ముందు శరీరమును కొంత  సాగదీయటము అవసరము అని ప్రతి వ్యాయామ భోధకుడు చెబుతారు కాని అది మాత్రమే సరిపోదు.
పరిగెత్తటము సాధన చేసేవారు కొన్ని యోగాసనములు నేర్చుకోవటము వలన చాలా ప్రయోజనము ఉంటుంది. శ్రీ శ్రీ యోగా వంటి కోర్సులో చెప్పే చిన్న చిన్న యోగాసనములు మీయొక్క శక్తిని పెంచుతాయి. ప్రాచీనమైనట్టి ఈ యొగాసనములకు కొంచెం సమయము కేటాయించడము వలన మీరు ఇంకా ఎక్కువగా పరిగెత్తగలరు.
తేలికగా చెప్పబడిన ఈ 10 యోగాసనములు వలన మీరు మీ పరిగెత్తగల సామర్ధ్యమును పెంచుకోవచ్చును.

 

  1. తితలీ ఆసనము (సీతాకోకచిలుక ఆసనము)
    ఈ ఆసనము వలన తొడలోపలి భాగము, మోకాలి వెనుక భాగము మరియు గజ్జ భాగము నకు చక్కని వ్యాయామము అవుతుంది.
    దీని వలన తుంటి భాగము, తుంటి మూల భాగములకు  చక్కగా వంగే గుణము కలుగుతుంది.
  2. అర్ధమశ్చీన్ద్ర ఆసనము (కూర్చుని వెన్ను భాగము సగము వరకు త్రిప్పటము)
    దీని వలన వెన్ను పూసకు సాగే లక్షణము పెరిగి, తేలికగా వంగే లక్షణము కలుగుతుంది.
  3. హస్తపాదాసనము  (నిలబడి ముందుకు వంగటము)
    శరీర వెనుక భాగములోని కండరములు బాగా సాగదీయబడి, పొత్తి కడుపు భాగము లోని అవయవములకు మరియు వెన్ను పూసకు తేలికగా వంగే లక్షణము కలుగుతుంది.
  4. ప్రావంత పాదహస్తాసనము (పాదములు కొంచెము యెడముగా వుంచి, నిలబడి ముందుకు వంగటము)
    తొడనరము, కాళ్ళు, పాదములకు సాగే లక్షణము కలుగుతుంది. వెన్నుపూస నిటారుగా ఉండేలా చేస్తుంది. మరియు పొత్తికడుపు భాగములకు శక్తి కలుగుతుంది.
  5. త్రికోణాసనము (ట్రయాంగిల్ ముద్ర) 
    ఈ ఆసనము వలన కాళ్ళు, మోకాళ్ళు, చీలమండలు, చేతులు మరియు ఛాతీ భాగములకు శక్తి కలుగుతుంది. తొడలు, గజ్జల భాగము, కాలి తోడనరము, భుజములు, ఛాతీ మరియు వెన్నుముక సాగదీయబడతాయి. దీని వలన మానసిక, శారీరిక సమతుల్యము పెంపొందింప బడుతుంది.
  6. వృక్షాసనము (చెట్టు భంగిమ)
    వృక్షాసనము వలన కాళ్ళు శక్తివంతము అవుతాయి. శరీరములో సమతుల్యము పెరిగి తొడల భాగములో బిగుతుతనము తగ్గుతుంది. ఈ ఆసనము శరీరమునకు నూతనోత్సాహము కలుగజేసి, పరుగెత్తుతున్న వ్యక్తి యొక్క మనసునకు సమతుల్యము కలుగుతుంది.
  7. వీరభద్రాసనము (యోధుని భంగిమ)
    ఈ ఆసనము మన చేతులకు, వెన్నెముక కిందభాగమునకు మరియు కాళ్ళకు సౌష్టవము కలుగును. శరీరములో శక్తి పెరిగి, సమతుల్యము కలుగు తుంది.
  8. కోణాసనము (రొండు చేతులు ఉపయోగించి ప్రక్కలకు వంగటము) 
    ఈ ఆసనము వలన శరీర ప్రక్కభాగములు మరియు వెన్నెముక సాగదీయబడినట్లు అవుతుంది. చేతులు, కాళ్ళు మరియు పొత్తికడుపు భాగములకు శక్తి కలుగుతుంది.
  9. పూర్వోత్తాసనము (బల్లపరుపు భంగిమ)
    తొడలు మరియు తుంటి భాగము సాగదీయబడతాయి. మణికట్టు, చేతులు, భుజాలు, వెన్నెముక మరియు శరీర వెనుక భాగము శక్తి పొందుతాయి.
  10. కుర్చీ భంగిమ (ఉత్కటాసనము)
    ఈ ఆసనము వలన వెన్నెముక, తొడభాగము, చాతిభాగమునకు వ్యాయామము అవుతుంది. తొడభాగము, చీలమండలు, కాళ్ళు, మోకాళ్ళ కండరములకు సౌష్టవము   కలుగుతుంది

పరుగెత్తుట అనునది చక్కటి వ్యాయామము. ఈ పరుగెత్తుట అనునది మిమ్మల్ని ఆరోగ్యముగా ఉంచి, మీలోని శక్తిని పెంపొందిస్తుంది. మీకు పరుగెత్తుటము ఇష్టము అయితే స్థానిక సంఘములలో చేరి మారథాన్ పోటీలలో కూడా పాల్గొనవచ్చును. మీకున్న అభిరుచిని యోగాతో కలిపి చెయ్యటము వలన మీలోని శక్తిని పెంపొందించుకుని, మీ పరుగుని మీరు పూర్తిగా ఆస్వాదించగలరు.

 

 

 
Founded in 1981 by Sri Sri Ravi Shankar,The Art of Living is an educational and humanitarian movement engaged in stress-management and service initiatives. Read More