విద్యార్థుల కు ధ్యానం చేయడం ద్వారా ఏకాగ్ర తను సులువుగా పెంపొందించుకోవడానికి సులువైన 8 పద్దతులు

ప్రస్తుతం విద్యార్థుల కు స్కూలు లేదా కాలేజ్ జీవితం ఎంతో  కష్టంతో కూడు కున్న బి అని చెప్పడము అతిశయోక్తి కాదు.  

ఇందుకు ముఖ్య కారణం  ఇంటర్నెట్ సేవ లు. ఇంటర్నెట్ వాడడం వలన మనసు తొందరగా విచలిత మౌతుంది. మరియు  కళాశాల యాజమాన్యం వారు, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏ గ్రేడ్ మార్కు లు పొందాలని  పెట్టె కాంపిటేషన్. 

ఇటీవల ఢిల్లీలో కొన్ని విద్యాసంస్థ లు తమ పాఠశాలలో  విద్యార్థులను చేర్చుకోవడానికి చేర్చుకోవడానికి మినిమం 100% హండ్రెడ్ పర్సెంట్ ఉండాలని పెట్టడము గమనించదగ్గ విషయం. 

 మరి ఇంత కష్ట తరమైన టువంటి ఏ గ్రేడ్ మార్కు లు  తెచ్చుకోవడం అందరి  విద్యార్థుల కు సాధ్యమా! , మరి వారి పరిస్థితి ఏమిటి?


 

 ధ్యానంతో ఏకాగ్రతను మెరుగుపరచడానికి విద్యార్థులకు 8 చిట్కాలు .

 

ప్రస్తుత సమయం విద్యార్థి జీవితంలో కష్టతరమైనదని చెప్పడం అతిశయోక్తి కాదు. విస్తారమైన ఇంటర్నెట్ వ్యాప్తి , చాలా ఎక్కువగా అన్య మనస్కులు అయ్యేందుకు దోహద పడుతోంది  మరియు నిరంతరం పెరుగుతున్న పోటీ కూడా కళాశాల కటాఫ్‌లను దాదాపుగా సాధించలేని స్థాయికి పెంచింది. భారతదేశంలోని న్యూ ఢిల్లీలోని కొన్ని కళాశాలలు తమ మొదటి కటాఫ్ జాబితాను 100% వద్ద ఉంచాయి. దేవుడా, పరీక్షలలో ఒకే మార్కు లోపం ఉన్నవారి పరిస్థితి ఏమిటి?

ఉన్నత తరగతిమరియు కాలేజీకి వెళ్ళే విద్యార్థులలో కూడా ఆందోళన  రేకెత్తే ప్రమాదాలు  పెరగడానికి ఇది ఒక ప్రధాన కారణం. అంతేకాక, ఇది ఒక వికృత వలయంలో  చిక్కుకు నే అవకాశం కూడా ఉంది.ఫలితంగా   వారి ఆందోళనల వల్ల వారి సామర్థ్యం తగ్గి ఏకాగ్రత కోల్పోయి క్రమంగా మరింత ఆందోళనకు  లోనవుతున్నారు.   ఈ దుర్భేద్య  చక్రమునువ్వు  దృష్టి సారించే సామర్థ్యాన్ని పెంచడం ద్వారా దీనిని ఎదుర్కోవటానికి ఏకైక మార్గం: ఏకాగ్రత శక్తి.

ఏకాగ్రత సామర్థ్యాన్ని పెంచే మంచి మార్గాలలో ఒకటి యోగా ద్వారా. మా మొబైల్ ఫోన్‌ల యొక్క హైపర్-ఫంక్షనాలిటీ కారణంగా, విద్యార్థులు ఈ రోజుల్లో చాలా నిశ్చల జీవితాన్ని గడుతున్నారు. వారి అధ్యయనాలు మరియు విశ్రాంతి డిజిటల్ తెరల చుట్టూ మాత్రమే తిరుగుతాయి. ఇక్కడే యోగా యొక్క బహుళ తర ఉపయోగాలు చూడాలి. ఆసనాలు మరియు ఇతర పద్ధతులు ఏకాగ్రత శక్తిని పెంచడమే కాక, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో కూడా సహాయపడతాయి.

అంతేకాక, యోగా యొక్క ప్రభావం కూడా మనస్సును గణనీయంగా శాంతపరుస్తుంది, తద్వారా విద్యార్థులు ఒకేసమయంలో విశ్రాంతి మరియు దృష్టి సారించే కష్టమైన సామర్థ్యాన్ని సాధించేలా చేస్తుంది.

మీ ఏకాగ్రత స్థాయిని మెరుగుపరచగల మరియు మీ అధ్యయనాలపై బాగా దృష్టి పెట్టడానికి సహాయపడే 8 చిట్కాలను మీకు అందించే కొన్ని సులభమైన యోగాసనాలు మరియు ఇతర ఉపయోగకరమైన సూచనలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

missing------

ప్రతీ శ్వాసతో భుజం కదలికలను కొనసాగించండి. ఊపిరి  విడుస్తూ, ముఖం, కళ్ళు మరియు నాలుకను విశ్రాంతి ఇవ్వండి. కొన్ని శ్వాసల తరువాత, భంగిమను విడుదల చేయండి.

తాడాసనం ఛాతీని వ్యాపించేలా చేస్తుంది, శరీర భంగిమలను మెరుగుపరుస్తుంది, తొడ ప్రాంతాన్ని బలపరుస్తుంది, ఏకాగ్రత మరియు ఎరుకను పెంచుతుంది. మరియు సయాటికా నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ ఆసనం శరీరంలో ఏదైనా అలసటను విడుదల చేయడానికి సహాయపడుతుంది.

2. వృక్షసనం (చెట్టు భంగిమ)

 విశ్రాంతి మరియు చైతన్యం నింపుతూ ఏకాగ్రత పెంచగల మరొక ఆసనం వృక్షాసనం. ఇది చేయుటకు, మీ కాళ్ళను సడలించి నేలమీద నిలబడండి. ఒక శ్వాస తీసుకోండి మరియు మీ కుడి పాదాన్ని నేల నుండి పైకి లేపండి. నెమ్మదిగా, లోపలి ఎడమ తొడపై నొక్కడానికి పాదం తీయండి. మోకాలి మీద పాదాన్ని ఆనించ వద్దు మరియు శరీరాన్ని సాధ్యమైనంత విశ్రాంతిగా ఉంచడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా, నమస్కార ముద్రలో అర చేతులు రెండు జోడించి తల  పైకెత్తండి. శరీరాన్ని వీలైనంత స్థిరంగా ఉంచండి. కొన్ని శ్వాసల తరువాత, భంగిమను విడుదల చేయండి. విశ్రాంతి తీసుకోండి.

వృక్షాసనం చెట్టు యొక్క స్థిరమైన ఇంకా అందమైన వైఖరిని ప్రతిబింబిస్తుంది. ఈ భంగిమ కాళ్ళు, చేతులు మరియు వెనుక భాగాన్ని విస్తరించడమే కాకుండా ఏకాగ్రతను కూడా మెరుగుపరుస్తుంది.

3. పశ్చిమోత్తనాసన (కూర్చుని ముందుకి వంగే ఆసనం ) క్రింది నడుము మరియు కాళ్ళు విశ్రాంతిగా లేకపోతే ఏకాగ్రత యొక్క స్థాయి తగ్గుతుంది  అనేది ఒక సాధారణ అనుభవం. అందుకే చాలా మంది ఉద్యోగస్తులు మరియు విద్యార్థులు, ముఖ్యంగా కొన్ని గంటలు అదేపనిగా కూర్చుని ఏకాగ్రతతో ఉండాల్సిన వారు, కొన్ని నిమిషాలు తిరిగేటప్పుడు మంచి అనుభూతి చెందుతారు.

పశ్చిమోత్తానాసనం పిరుదులు ,హామ్ స్ట్రింగ్స్ (తొడ వెనుక కండ రాలు )మరియు క్రింద నడుమును సులభంగా సాగదీయగలదు, తద్వారా ఎక్కువ సేపు ఏకాగ్రత తో కూర్చునేలా చేస్తుంది. ఇది చేయుటకు,  ముందు కూర్చొని , కాళ్ళు ముందుకి బాగా సాగదీయడం తో ప్రారంభించండి. రెండు చేతులను పైకి లేపి, తలపైకి. పిరుదుల నుండి శరీరాన్ని బాగా సాగదీస్తూ చేతి వేళ్లతో కాలి వేళ్ళుతాకేటట్లు ముందుకు సాగదీయండి. గడ్డం కాలి వేళ్ళ వైపు సాగదీస్తూ శరీరాన్ని సాగదీయాలి. చేతులు ఎంతవరకూ సాగదీయ గలరో అంతగా ముందుకు వంగండి.ఈ ఆసనం చేస్తున్నప్పుడు, వెన్నెముకను నిటారుగా ఉంచండి మరియు నెమ్మదిగా సులభంగా ముందుకు సాగడం ద్వారా దాన్ని పొడిగించండి.

4.  సర్వాంగాసనము(భుజం స్టాండ్) ఎక్కువ సేపు పని చేసేటప్పుడు మీ మెదడు నుండి రక్తం అంతా ఇంకి పోయినట్లు అనుభూతి చెందు తుంటారు. అలాంటి సమయాల్లోనే ‘తల మందగించింది’ అనే పదం వాడుకలోకి వచ్చింది. దీనిని ఎదుర్కోవటానికి, ఈ ఆసనం అభ్యసించవచ్చు. మీ రక్తాన్ని తిరిగి మీ మెదడుకు పరుగెత్తించడం ద్వారా, తలని సమర్థవంతంగా రీఛార్జ్ చేయడం మరియు ఏకాగ్రతను మెరుగు పరచడం జరుగుతుంది.

 నేలపైన వీపుపై పడుకోండి. రెండు కాళ్ళను పైకి ఎత్తండి, తద్వారా దిగువ శరీరం కొద్దిగా పైకి ఎత్త బడుతుంది.  రెండు అరచేతులను పిరుదులు మరియు క్రింది నడుము గట్టిగా నొక్కే టట్లు ఉంచండి. . ఇప్పుడు, చేతుల సహాయం మరియు మద్దతుతో, కాళ్ళతో పాటు కింది నడుమును పైకి నెట్టండి. భుజాలు మరియు చేతుల పైన శరీరం యొక్క మొత్తం బరువు ఉండేటట్లు చూడండి. క్రిందికి వచ్చేటప్పుడు, చేతుల సహాయంతో నెమ్మదిగా ముందు వీపు ని క్రిందికి తీసుకురండి, ఆపై నెమ్మదిగా కాళ్ళను  దించండి.

5. సూర్యనామస్కర్ (సూర్య నమస్కారాలు) చేయగల మరొక యోగాసనం .సూర్య నమస్కారాలు ఏకాగ్రతను మెరుగుపర చడం తో బాటు, ఊబకాయాన్ని తగ్గించడంలో మరియు ఆల్‌రౌండ్ ఫిట్‌నెస్ మరియు కండరాలకు కోమలత్వాన్ని ఇస్తుంది.

6. ఏకాగ్రతను మెరుగుపరచడానికి ధ్యానం ఒక్కసారి వినడం ద్వారా సినిమా డైలాగ్స్ నేర్చుకోవడం ఎందుకు అంత సులభం అని చాలా మంది విద్యార్థులు తమ పగటి కలలలో ఆశ్చర్య పోతూ ఉంటారు! కానీ వారు ఒకే పేజీని చాలాసార్లు చదివి నా, పూర్తిగా గ్రహించ లేరు. ఎందుకంటే మన మనస్సు విశ్రాంతిగా ఉన్నప్పుడు మాత్రమే దేన్నైనా పూర్తిగా అర్థం చేసుకోగలదు. అయినా చదువుకునేటప్పుడు విశ్రాంతి గా ఉండడం అనేది కొంచెం కష్టం. ఎందుకంటే మనం చదువుకునే వాతావరణం, ఎంతసేపు ఇంకొన్ని పరీక్షలు రాస్తే చాలు మనం కెరీర్లో పైకి వెడతాము లేదా కింద పడి పోతాము అని నిరంతరం ఎత్తి చూపిస్తూనే ఉంటుంది.

అంతేకాక, చదువుకునేటప్పుడు కూడా, చాలా మంది విద్యార్థులు తమ మనస్సు ఆలోచనలతో పేలిపోతోందని మరియు వారు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారని భావిస్తారు. రోజువారీ పనుల వల్ల అనుభూతి చెందే భావోద్వేగాలు అయిన,  అసూయ, ద్వేషం మరియు చికాకు వంటివి మనస్సు కు చికాకు కలిగిస్తాయి. ఏకాగ్రతను కష్టతరం చేస్తాయి.

ఈ భావోద్వేగాల నుండి మనస్సును శాంతపరచడానికి, ఇక్కడ ధ్యానం మీకు ఎంతో నైపుణ్యంతో సహకరిస్తుంది మరియు ఏకాగ్రత సామర్థ్యాన్ని పెంచుతుంది. అధికారిక ఆర్ట్ ఆఫ్ లివింగ్ యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉన్న అనేక గైడెడ్ ధ్యానాల నుండి ఏదైనా సాధన చేయాలని మేము సిఫార్సు చేస్తున్నాము. కేవలం 20 నిమిషాల ధ్యానం వలన మనస్సురీఛార్జ్ చేయబడుతుంది, కొన్ని గంటల పాటు చేసే పనిని కానీ చదువుని కానీ సమర్థవంతంగా చేసే లాగా మిమ్మల్ని తయారుచేస్తుంది.

7. మనం ఎంచుకునే జీవనశైలి కూడా ఏకాగ్రతను పెంచుతుంది

మన శక్తి స్థాయిని, ఏకాగ్రత స్థాయిని మనం ఎంచుకునే జీవనశైలి కూడా ప్రభావితం చేస్తుంది అనేది నిజం. చిన్న చిన్న విషయాలైనా నా ఎటువంటి ఆహారం తీసుకున్నాము ఎన్ని గంటలు నిద్ర పోయాము అనేది కూడా చదువులో భేదాన్ని కనబరుస్తుంది. నిద్ర  ఎక్కువ  లేదా తక్కువ అయితే బద్ధకం లేదా అలసట కలిగిస్తుంది. 

 అదేవిధంగా, ఎక్కువ ఆహారం మనస్సును మగత చేస్తుంది, చాలా తక్కువ ఆహారం లేదా కారంగా ఉండే ఆహారం తీసుకోవడం మనస్సును ఆందోళనకు గురి చేస్తుంది.

అంటే మీరు కఠోరమైన మిలటరీ జీవనశైలిని అలవర్చుకోవాలని  లేదా బ్ చప్పటి ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉందని కాదు. కానీ నిద్ర మరియు భోజనాన్ని పర్యవేక్షించడం ద్వారా, మరియు రోజువారీ దినచర్యపై కొంచెం శ్రద్ధ చూపడం ద్వారా ఏకాగ్రత స్థాయిలు మరియు జ్ఞాపక శక్తి పెరగడానికి చాలా ఉపయోగపడతాయి.

8. ఒక్కసారి ఆలోచించండి 

మీరు మీ ఇష్టమైన పనిని ఎక్కువ సేపు చేస్తుంటే మీరు గమనించే ఉంటారు కొద్దిసేపు అయిపోయిన తర్వాత మీ మనసు  అలసి పోవడం  జరుగుతూ ఉంటుంది. కాబట్టి, కొంత సమయం తరువాత, విశ్రాంతి తీసుకోండి. ఇలా విశ్రాంతి సమయంలో  మీరు ఏదైనా కొత్తవి కొన్ని  పనులు చేసి చూడండి, ఉదాహరణకి మనకి ఆదివారం దినపత్రికలో వచ్చే పదాల చిక్కుముడి విప్పడము  గాని, చిన్న పాటి వ్యాయామం కానీ, కళ్ళు మూసుకుని కొద్దిసేపు  విశ్రమించడం  కానీ ,  ఇటు వంటి పనులు చేయడం వల్ల  మీ మనసు కాసేపు మీ బాధ్యతల నుండి విడివ డుతుంది. దీని వలన ప్రయోజనం ఏమిటంటే ఉదాహరణకి ఒక బాణాన్ని మనం ఎంత వెనక్కి లాగి విడిచిపెడితే  అంత వేగంగా ముందుకెళ్తుంది అలాగే ఇటువంటి చిన్న పనులు చేయడం ద్వారా మన శక్తిని మరింత సమర్థవంతం గా వినియోగించుకోవడానికి దోహదపడుతుంది.

 
Founded in 1981 by Sri Sri Ravi Shankar,The Art of Living is an educational and humanitarian movement engaged in stress-management and service initiatives. Read More